Saturday, April 27, 2024
- Advertisement -

వెనక్కి తగ్గం అంటున్న రైతులు.. నేడు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం..!

- Advertisement -

నూతన సాగు చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తున్న అన్నదాతలు.. దేశవ్యాప్తంగా శనివారం చక్కాజామ్​(రాస్తారోకో)ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా ఇవాళ చక్కాజామ్‌ పేరుతో జాతీయ రహదారుల్ని దిగ్బంధనం చేయనున్నారు. రిపబ్లిక్‌ డే ట్రాక్టర్ పరేడ్‌ తర్వాత కేంద్రం రైతుల ఆందోళనపై ఉక్కుపాదం మోపడంతో రైతు సంఘాలు చక్కాజామ్‌కు పిలుపునిచ్చాయి. ఇప్పటికే దీనిపై రైతు సంఘాలు విస్తఅత ప్రచారం నిర్వహించాయి.

చక్కాజామ్‌ను విజయవంతం చేసేందుకు ముఖ్యమైన సూచనలతో ఎస్‌కెఎం నేత దర్శన్‌పాల్‌ ప్రకటన విడుదల చేశారు. రహదారుల దిగ్భందానికి సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు చక్కా జామ్‌ ఆందోళన కొనసాగుతుంది. 3 గంటల ఆందోళన ముగియగానే ఆందోళనకారులు నిముషం పాటు వాహనాల హారన్‌ మోగిస్తారని రైతు సంఘాలు పేర్కొన్నాయి.

చక్కాజామ్‌ పూర్తిగా శాంతియుతంగా జరుగుతుందని, ఎటువంటి వాగ్వాదాలకు పాల్పడవద్దని ఆందోళనకారులకు సూచించారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దులో రైతులు ఎప్పటిలానే బైఠాయించనున్నారు.  మరోవైపు రైతుల చక్కా జామ్‌ నేపథ్యంలో ఢిల్లీతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రిపబ్లిక్‌ డే ట్రాక్టర్‌ మార్చ్ ఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్దితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఏపిలో పంచాయతీ ఎన్నికల మూడో దశ కోసం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ!

రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌లోకి అర్జున్ టెండూల్కర్..

టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబో మరోసారి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -