Sunday, April 28, 2024
- Advertisement -

ప్రియుడి కోసం సొంత తమ్మున్ని ముక్కలుగా నరికి చంపిన సినీనటి!

- Advertisement -

కామా తురానాం న భయం న లజ్జ.. అన్నట్లు కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ సినీ నటి ప్రియుడి కోసం సొంత తమ్మున్నే అతి దారుణంగా నరికి చంపింది. ప్రియుడి కోసం తోడబుట్టిన తమ్ముడిని కిరాతకంగా హతమార్చిన కన్నడ నటి ఉదంతం సంచలనంగా మారింది. ధర్వాడ్ ఎస్పీ తెలిపిన వివరాల మేరకు… రియలెస్టేట్ వ్యాపారి నియాజ్ తో షనాయా ప్రేమాయణం సాగిస్తోంది. పేయింగ్ గెస్ట్ లా ఆయన ఇంట్లోనే ఉంటోంది.

అది నచ్చని ఆమె తమ్ముడు వ్యతిరేకించాడు. దీంతో, తన ప్రేమకు అడ్డుగా ఉండడంతో అతని మట్టుబెట్టేందుకు ప్లాన్ వేసింది. ఈ నెల 12న దేవరగుడిహల్ అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ సంచిలో చుట్టేసిన మృతదేహం లభ్యమైంది. తల, మొండెం వేరువేరుగా ముక్కలు చేసి తగలబెట్టి ప్యాక్ చేసి అడవిలో పడేశారు. ఇతర శరీర భాగాలను హుబ్బళ్లి నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో గుర్తించారు.

కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు భయంకర నిజాలు తెలిసి షాక్ తిన్నారు. మృతదేహాన్ని కొద్దిరోజుల కిందట కనిపించకుండా పోయిన రాకేష్ కత్వెదిగా పోలీసులు గుర్తించారు. షనాయా ప్రేమ విషయం లో తరుచూ గొడవ పెట్టుకుంటున్న ఆమె సోదరుడు రాకేష్ ని ఆమె చంపి ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే షనాయా నే తమ్ముడిని అత్యంత దారుణంగా చంపినట్లు తెలుసుకున్నారు.

నియాజ్ ఇంట్లోనే అతనికి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం శవాన్ని ముక్కలుగా నరికి, తగలబెట్టి, ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి అటవీ ప్రాంతంలో పడేశారు. అతని శరీర భాగాలను హుబ్బళి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు గుర్తించారు. ఆమె ప్రియుడు సహా మరో ముగ్గురిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

కూతురిని ప్రేమించాడని యువకుడి దారుణ హత్య

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం.. ఇంటికప్పు కూలి ఐదుగురి మృతి

జీవితంలో గెలవాలంటే ఈ రెండు సూత్రాలు పాటించాలి.. సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -