తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ పార్టీకి ఎంతో సేవ చేశామని.. పార్టీ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నామని.. అలాంటిది తమకు టికెట్టు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని.. పార్టీ మారుతామని ఆయా పార్టీ నేతలు అంటుంటారు. ప్రస్తుతం వరంగల్ లో టీఆర్ఎస్ నేతల నిరసనలు జోరు అందుకుంటున్నాయి.
జిల్లాలో టికెట్ రాని అభ్యర్థులు వీరంగం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఉద్యమ నాయకుడు దర్శన్ ఆత్మహత్య చేసుకుంటానంటూ హాల్ చేయగా, తాజాగా మరో మహిళా నేత ఆత్మహత్య చేసుకుంటానంటూ ఏకంగా పెట్రోల్ సీసాతో భవనంపైకి ఎక్కి వీరంగం సృష్టించారు. వరంగల్ కార్పొరేషన్ లో ఎన్నికలలో 58వ డివిజన్ టికెట్‌ను తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సీనియర్ నేత శోభారాణి బిల్డింగ్ పైకెక్కి నిరసనకు దిగారు.
పార్టీకి గత కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబం ఎంతగానో కష్టపడ్డారని తాను టికెట్ ఆశిస్తే.. ఏవో సాకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని శోభారాణి హెచ్చరించారు. ఒక చేతిలో పెట్రోల్ సీసా పట్టుకుని అంటించుకుంటానంటూ ఒకసారి, భవనంపై నుంచి దూకుతానని మరోసారి బెదిరిస్తూ హాల్ చల్ చేశారు. పార్టీ పెద్దలు, పోలీసులు శోభారాణిని కిందకు దించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.
రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసిన షర్మిల