Thursday, March 28, 2024
- Advertisement -

తెలంగాణలో మినీ పురపోరు పోలింగ్ ప్రారంభం

- Advertisement -

కరోనా నేపథ్యంలో ఇటీవల సాగర్ లో జరిగిన ఉప పోరులో పలువురు కరోనా భారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా భద్రతల నేపథ్యంలో నేడు తెలంగాణలో మీనీ సంగ్రామ పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం లో మినీ పురపొరు ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది.

వరంగల్ నగర పాలకసంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 11,34,032 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

9 వేల 809 మంది పోలింగ్ సిబ్బంది, 4 వేల 557 మంది పోలీసు సిబ్బందిని నియమించింది ఎన్నికల సంఘం. అందరికీ ఫేస్‌ షీల్డ్‌, శానిటైజర్లను అందజేశారు. మొత్తం 11 లక్షల 34 వేల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఆరు అడుగులకు ఒక్కరు చొప్పున క్యూలైన్‌లో నిలబడేట్లు ఏర్పాట్లు చేశారు అధికారులు. మే 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

కూకట్ పల్లి కాల్పులు.. అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల పనే : సీపీ సజ్జనార్

విద్యార్థుల కోసం కేఏపాల్ దీక్ష..

సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న బెల్లంకొండ.. ఈసారైనా విజయం అందుకుంటాడు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -