Sunday, June 2, 2024
- Advertisement -

వైసీపీ మేనిఫెస్టో…సిద్ధం!

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ మేనిఫెస్టో రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు మేనిఫెస్టో కమిటీ భేటీ కానుండగా కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే మేనిఫెస్టో రిలీజ్ డేట్‌ని ఖరారు చేయనున్నారు.

ఈ నెల 10న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో సీఎం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు భారీగా జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు వైసీపీ నేతలు. సిద్ధం సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. 15 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని విజయసాయి తెలిపారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఏం చేశారనేది వివరించనున్నారు. ఇక ఈ సిద్ధం సభల అనంతరం నియోజకవర్గాల వారిగా పర్యటించనున్నారు జగన్. ఇక బాపట్ల సిద్ధం సభ కోసం 100 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేయగా పార్కింగ్,సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -