Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబుకు నిజంగా షాకే..ఇకపై రోజుకు ఒకసారే!

- Advertisement -

అవినీతి కేసుల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు ఊహించని షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటీషన్లపై విచారణ శుక్రవారానికి వాయిదా పడగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ అంశాలపై విచారణను వాయిదా వేసింది. లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని ఇరుపక్షాల న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. ఇక బెయిల్ పిటిషన్ వాయిదాల మీద వాయిదా పడుతుండగా తాజాగా చంద్రబాబు ములఖాత్‌కు సంబంధించి చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది.

ఇప్పటివరకు చంద్రబాబుకు రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లకు అనుమతించగా దానిని ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందుకే ఒకటికి కుదించానని చెప్పారు జైలు అధికారులు. జైలులో రెండు వేలకు పైగా మంది ఖైదీలున్నారని వీరికి చంద్రబాబు ములాఖత్‌ల వల్ల ఆసుపత్రికి వెళ్లి వచ్చేవారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు. ముద్దాయిలను కోర్టుకు హాజరుపరచడంలో తీవ్ర జాప్యం, భద్రత కారణాలను దృష్టిలో ఉంచుకుని ఒక్క లీగల్‌ ములాఖత్‌కు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు.

జైలు అధికారుల నిర్ణయం సరేనని వాదన వినిపిస్తుండగా టీడీపీ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబును కలవకుండా చేసేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే దసరా అయిపోయే వరకు బాబు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -