Monday, May 20, 2024
- Advertisement -

నాడు రావాలి జగన్…నేడు ఏపీ నీడ్స్ జగన్!

- Advertisement -

వైనాట్ 175…ఇప్పుడు ఏపీ అంతటా మార్మోగిపోతుండగా ఇప్పుడు తాజాగా సరికొత్త నినాదాన్ని ఎంచుకున్నారు ఏపీ సీఎం జగన్. విజయవాడ ఇందిరా గాంధీ – మున్సిపల్ స్టేడియంలో పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు. వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ చేపట్టబోయే కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ప్రజలకు సేవకుడిగా సేవలందించాం కాబట్టే 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన జరిగిందని తెలిపిన జగన్..మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపిన సీఎం..ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చామన్నారు.

విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని.. 22 లక్షల ఇళ్లు అక్క చెల్లెమ్మల పేరుతో నిర్మాణం జరుగుతున్నాయన్నారు. ఇందులో 80శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు. ప్రజలకు మరింత మంచి చేయడానికి మరోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు. ఏపీకి జగనే ఎందుకు కోవాలో చెప్పేందుకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

కోటీ 60 లక్షల ఇళ్లకు వెళ్లేందుకు టార్గెట్‌గా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 31 వరకు బస్సు యాత్రల్ని నిర్వహించనున్నామని…ప్రతీరోజు మూడు మీటింగ్‌లు జరుగుతాయని వెల్లడించారు. ఇది పేదవాడికి పెత్తందార్లకు జరగబోయే యుద్ధమని..ఈ యుద్దంలో వైసీపీదే విజయం అని తేల్చిచెప్పారు. మొత్తంగా బస్సుయాత్రతో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -