Monday, May 20, 2024
- Advertisement -

భూ పంపిణీ..సీఎం జగన్‌పై సర్వత్రా హర్షం

- Advertisement -

ఏపీలో భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఏలూరు జిల్లా నూజివీడులో భూమి లేని పేదలకు అసైన్డ్ భూముల పట్టాల పంపిణీ, హక్కుల కల్పన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. మొదటి దశలో 18 లక్షల ఎకరాలు,రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం అన్నారు. పేదలకు మద్దతుగా నిలుస్తుంటే కొంతమంది పెత్తందార్లకు ఇది నచ్చడం లేదన్నారు. రాష్ట వ్యాప్తంగా 35,44,866 ఎకరాలను పంచగా 20, 24,709 మంది లబ్ది చేకూరుతుందన్నారు.

రైతు భూ సమస్యలకు పరిష్కారం చూపామని…కొత్తగా డీకేటీ పట్టాలు ఇస్తున్నామన్నారు.భూ తగాదాల సమస్యలకు పరిష్కారం చూపిస్తు కొత్తగా రికార్డులు అప్ డేట్ చేశామన్నారు. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామన్నారు. పేదవాడికి భూమి హక్కులు కల్పించడం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగుతున్నామన్నారు. అసైన్డ్ భూములు, లంక భూములపై పేదలకు పూర్తిగా హక్కు కల్పిస్తున్నాం అన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకు హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు సీఎం జగన్. దీని ద్వారా వేల మందికి లబ్ది చేకూరిందన్నారు. పేద వారికి మంచి చేయాలన్న ఆరాటం ఉన్న ప్రభుత్వం తమదన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదని..అందుకే వారికి డీకేటీ పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సర్వీసు ఇనాం భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి ఆదేశాలను జారీ చేశామన్నారు. దీని ద్వారా లక్షల మందికి లాభం చేకూరిందన్నారు. భూ పంపిణీ ద్వారా ఎస్సీ,ఎస్టీ,బీసీలు,మైనార్టీల్లోని పేదలకు లబ్ది చేకూరిందన్నారు. గతంలో ఎప్పుడు ఏ పార్టీ చేయని విధంగా పేద వారికే హక్కులు కల్పించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల 44 వేల 860 ఎకరాల భూములపై 20 లక్షల 24 వేల 709 మంది లబ్ది పొందారని చెప్పారు. ప్రతీ పేదవాడు కూడా కాలర్ ఎగరేసి ఇది మా అన్న ప్రభుత్వం అని చెప్పుకునే విధంగా పనిచేస్తున్నామన్నారు.

పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. స్వతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన కొన్నివర్గాల వారికి స్మశాన వాటికలు కూడా లేవని…వారి కోసం ప్రతీ గ్రామంలో స్మశాన వాటికల నిర్మాణం చేపట్టే విధంగా ముందుకు సాగుతున్నామన్నారు. కొన్ని గ్రామాల్లో స్మశాన వాటికలకు భూములు అప్పగించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. పేదల గుండె చప్పుడు తెలిసిన సర్కార్ ఇదని…గతంలో పెత్తందార్ల ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేయలేదన్నారు. మొత్తంగా లక్షల ఎకరాలను పంచిన జగన్ సర్కార్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -