Saturday, May 18, 2024
- Advertisement -

ఏపీలో బీఆర్ఎస్ క్లోజేనా?

- Advertisement -

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టి జాతీయ రాజకీయాల్లో సత్తాచాటాలని భావించారు కేసీఆర్. కానీ ఆయన ఆశలకు ప్రజలు గండికొట్టారు. అధికారానికి బీఆర్ఎస్ దూరం కావడంతో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ సత్తాచాటుతారా..?అసలు ఆ వైపు అడుగేస్తానా అనే సందేహం అందరిలో నెలకొంది.

ఇక జాతీయ రాజకీయాల్లో భాగంగా కేసీఆర్ ప్రధానంగా ఫోకస్ చేసింది ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర రాజకీయాల పైనే. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కార్యాలయాలు సైతం ప్రారంభించారు. ఇక ఏపీకి అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌ను నియమించారు. ఆయన కూడా కొంతకాలం చాలా యాక్టివ్ గా పనిచేశారు. పలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే తీరా తెలంగాణా ఎన్నికల ముందు సైలెంట్ అయిపోయారు. అయితే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఏపీలో బీఆర్ఎస్ ప్రస్తావనే లేకుండా పోయింది.

పొరుగు రాష్ట్రం ముద్రపడ్డ పవన్ జనసేన ప్రస్తావనే లేకుండా పోయింది. దీంతో ఏపీలో కూడా బీఆర్ఎస్ పరిస్థితి ఇదే కావొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఏపీ నుండి బీఆర్ఎస్‌లో చేరిన నేతలు పునరాలోచనలో పడ్డారట. వారంతా పార్టీ మారితే ఇక ఏపీలో బీఆర్ఎస్‌ చాప్టర్ క్లోజ్ అనే ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -