Friday, May 17, 2024
- Advertisement -

టీడీపీకి నయా ప్లాన్..వర్కవుట్ అయ్యేనా?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ సింపతిని ప్రజల్లో పెంచేందుకు ఆ పార్టీ నేతల దశల వారీ ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా లోకేష్ హస్తినాలో తన వాయిస్ వినిపిస్తుండగా ఓ వైపు బాలకృష్ణ , మరోవైపు భువనేశ్వరి, బ్రహ్మాణి అందోళనల్లో పాల్గొంటున్నారు. ముందస్తు ఎన్నికలు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఎక్కువ రోజులు జైల్లో ఉండటం పార్టీకి మంచిది కాదని భావిస్తున్న నేతలు ఆయన్ని బయటకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రధానంగా లోకేష్ నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ చంద్రబాబు అరెస్ట్ అక్రమమని చెప్పే ప్రయత్నం చేస్తుండగా తాజాగా పార్లమెంట్ సమావేశాలు వేదికగా నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ ఎంపీలకు కీలక సూచనలు చేశారట లోకేష్. పార్లమెంట్ వేదికగా చంద్రబాబు అరెస్ట్ అక్రమమని చెప్పగలిగితే జరిగిన డ్యామేజ్‌లో కొంతైన తగ్గించుకోవచ్చని భావిస్తున్నారట. అంతేగాదు ప్రజల్లో కూడా సానుభూతి మరింత పెరగడానికి దోహదపడుతుందని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా ఒత్తిడి కూడా తేవొచ్చనే ప్లాన్‌లో ఉన్నారట.

అయితే పార్లమెంట్ లో చంద్రబాబు అరెస్ట్ ప్రస్తావనపై కేంద్రం స్పందిస్తుందా లేదా అన్నదే ప్రధాన సమస్య. ఎందుకంటే టీడీపీ అరెస్ట్‌ని బీజేపీ లైట్‌గా తీసుకుంది.అందుకే ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించిన బీజేపీ తమకు సంబంధం లేదు అన్నట్లుగా బీజేపీ పెద్దలు వ్యవహారించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పార్లమెంట్‌లో చంద్రబాబు అరెస్ట్ ప్రస్తావన తెచ్చి లబ్ది పొందాలని చూస్తున్న టీడీపీ నేతల వ్యూహాం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -