Monday, May 20, 2024
- Advertisement -

17ఏ చుట్టే చంద్రబాబు భవితవ్యం!

- Advertisement -

టీడీపీ హయాంలో జరిగిన అవినీతి కేసులన్నీ 17ఏతో ముడిపడి ఉన్నాయి. అవినీతి కేసుల్లో చంద్రబాబు తన పేరు ప్రస్తావనకు రాగానే సెక్షన్ 17ఏ పల్లవి అందుకున్నారు. అవినీతి కేసుల్లో ఎక్కడ తప్పు చేయలేదని చెప్పకుండా అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలంటూ మెలిక పెట్టారు.

చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న డే 1 నుండి ఆయన తరపు లాయర్ల వాదన ఇదే. అటు హైకోర్టులోనూ ఇటు సుప్రీం కోర్టులోనూ ఇదే వాదనలు వినిపించారు. ఇక సుప్రీంలో అయితే 17ఏపై సుదీర్ఘ వాదనలు జరిగిన సందర్భాలున్నాయి.

సీఐడీ తరపున ముకుల్ రోహిత్గీ వానదలు వినిపంచగా చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరుపక్షాలు 17ఏకి సంబంధించి బలంగా వాదనలు వినిపించాయి. ఇక ఈ వారంలోనే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు సంబంధించిన పిటిషన్ విచారణకు రానుండగా న్యాయస్థానం ఇచ్చే తీర్పుపైనే చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -