Monday, May 20, 2024
- Advertisement -

కర్నూల్‌పైనే బాబు ఆశలన్నీ!

- Advertisement -

ఏపీలో టీడీపీని అధికారంలోకి తేవడానికి తెగ కష్టపడుతున్నారు చంద్రబాబు. ఇందుకోసం అడ్డగోలు హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక జిల్లాల వారీగా గెలుపు లెక్కలేసుకుంటున్న చంద్రబాబు…కర్నూల్‌లో మెజార్టీ సీట్లు గెలిచే విధంగా ప్రణాళిక రచిస్తున్నారట.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు స్థానాలనే గెలుచుకోగా 2019లో వైసీపీ కంప్లీట్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 14 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించింది.

అందుకే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కర్నూలు జిల్లాలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని భావిస్తున్నారు బాబు. ఈ జిల్లాలో పట్టు సాధిస్తే గెలుపు ఖాయమని భావిస్తుండగా వైసీపీ మాత్రం ఈ సారి తన పట్టు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకే కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌ల మార్పు, మరికొన్ని స్థానాల్లో కొత్తవారిని బరిలో దింపారు.

ఇక కర్నూల్‌లో మెజార్టీ స్థానాలు వస్తే అధికారం టీడీపీదేన్నది బాబు సెంటిమెంట్. అందుకే మూడువారాల వ్యవధిలో చంద్రబాబు ఐదుసార్లు కర్నూలు జిల్లాలో పర్యటించారు. యువగళం పేరుతో నారా లోకేష్ నాలుగుసార్లు పర్యటించగా, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం జిల్లాలో మూడురోజులు పర్యటించారు. అయితే టీడీపీ నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్న ఓటర్లు మాత్రం ఎవరి వైపు ఉండనున్నారో మరికొద్దిరోజుల్లో తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -