Saturday, May 18, 2024
- Advertisement -

చంద్రబాబు @ ఖైదీ నెంబర్ 7691

- Advertisement -

14 రోజుల రిమాండ్ నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య టీడీపీ అధినేత చంద్రబాబను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక జైలులో కోర్టు ఆదేశాల మేరకు స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గదిని సిద్ధం చేయగా ఆయనకు ఖైదీ నంబర్‌ 7691 కేటాయించారు.దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబును కలిసేందుకు లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు పెద్త ఎత్తున జైలుకు చేరుకున్నారు.

చంద్రబాబుకు ఇంటి భోజనంతోపాటు మందులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. ఇక ఇప్పటికే ఏసీబీ కోర్టులో బాయి బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయగా ఇవాళ విచారణ జరగనుంది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇక ఇవాళ ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునివ్వగా ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు 144 సెక్షన్‌ విధించడంతో పాటు ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు.

ఇక ఈ కేసులో ప్రధాన సూత్యధారి చంద్రబాబేనన్న సీఐడీ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించినట్లు తెలుస్తోంది. అందుకే 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఐడీ 28 పేజీల రిమాండ్‌ రిపోర్టును సమర్పించింది. ఇక సుదీర్ఘంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్ధానం చంద్రబాబు రిమాండ్‌కే మొగ్గుచూపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -