Monday, May 20, 2024
- Advertisement -

బీజేపీతో పొత్తుకు నో..తేల్చేసిన బాబు!

- Advertisement -

ఏపీలో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ససేమీరా అంటున్నారా..?బీజేపీతో టీడీపీని కలపాలని పవన్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ నుండి బయటకు రావాలని పవన్‌కు సూచించారట చంద్రబాబు. ఇప్పుడు ఇద – జనసేన కూటమి నేతల్లో చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి కొద్దిరోజులుగా బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం చూస్తే అర్ధమవుతోంది. ఎందుకంటే పవన్‌తో ఓకే కానీ టీడీపీ అనగానే బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. దీంతో టీడీపీ – బీజేపీ మధ్య గ్యాప్ రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. దీనికి తోడు తెలంగాణ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు మైండ్ సెట్ పూర్తిగా చేంజ్ అయింది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పాటు లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలతో జట్టు కట్టాలని భావిస్తున్నారు చంద్రబాబు.

ఇందులో భాగంగానే పవన్‌కు సైతం ఇదే సూచించారట చంద్రబాబు. బీజేపీతో ఎంత వీలైతే అంత త్వరగా బయటకు రావాలని చెప్పారట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లను పూర్తి స్థాయిలో కైవశం చేసుకోవాలంటే బీజేపీ నుండి బయటకు రావడమే బెటర్ అని తెలపగా పవన్ సైతం ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో మొత్తం 37 రిజర్వుడు సీట్లు ఉండగా 2019లో వైసీపీ 36 సీట్లు గెలుచుకుంది. దీంతో వైసీపీకి బ్రేక్ వేయాలంటే బీజేపీని దూరం చేసుకోవడమే బెటర్ అని చంద్రబాబు అంచనా.. అందుకే వపన్‌కి సైతం ఇదే విషయాన్ని చెప్పారు చంద్రబాబు. దీంతో పాటు బీజేపీ పొత్తు వల్ల రాజకీయంగా భారీ నష్టం జరుగుతుందని.. చెప్పారట. ఇక త్వరలో వీరిద్దరూ కలిసి చేయనున్న యాత్రలో ఇదే విషయాన్ని వెల్లడించనున్నారని ప్రచారం జరుగుతోండగా ఇది బీజేపీకి ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామమేనని టాక్ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -