Monday, May 20, 2024
- Advertisement -

మధ్యంతర బెయిల్‌కే ఇంత చేస్తే..?రేపు నేరం రుజువైతే?

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు 52 రోజుల రిమాండ్ తర్వాత మధ్యంతర బెయిల్ వచ్చింది. అది కండీషన్స్ అప్లై. కానీ బాబు అనుకూల మీడియాలో మాత్రం నిజం గెలిచింది..బాబుకు ఈ కేసులో క్లీన్ చీట్ వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరి టీడీపీ నేతలు మాట్లాడుతుండటం విశేషం.

ఇక బాబుకు ఆరోగ్య కారణాల రీత్యా మాత్రమే బెయిల్ ఇచ్చామని స్పష్టంగా న్యాయస్థానం చెప్పినా న్యాయం గెలిచింది అంటూ సంబరాలు చేసుకోవడం అందరి చేత నవ్వు తెప్పిస్తోంది. ఇక బాబు తిరిగి అంటే నాలుగు వారాల తర్వాత సెప్టెంబర్ 28న 5 గంటల లోపు జైలుకు రావాల్సిందే. ఈ విషయం తెలిసినా ఎందుకు సంబరాలు చేసుకంటున్నారో అర్ధం కాని పరిస్థితి.

ఈ కేసులో బాబు మెయిన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 10న జరగనుంది. ఆ రోజు బెయిల్ రద్దు చేస్తే పరిస్థితి ఏంటీ…అప్పుడు టీడీపీ నేతలు మొహం ఎక్కడ పెట్టుకుంటారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక హైకోర్టు ఇచ్చిన కండీషన్స్‌ను చంద్రబాబు ఎక్కడా పట్టించుకోలేదు. బయటకు వస్తూనే ప్రసంగం చేశారు. ప్రెస్ మీట్ పెట్టొద్దని చెప్పినా పట్టించుకోలేదు. ఇక టీడీపీ నేతలు, చంద్రబాబు ఇలానే అతి చేస్తే బెయిల్ రద్దైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే టాక్ నడుస్తోంది.

మధ్యంతర బెయిల్ సంగతి పక్కన పెడితే ఒక వేళ నేరం రుజువైతే చంద్రబాబు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. జైలు శిక్ష సంగతి పక్కనపెడితే టీడీపీ, చంద్రబాబుకు మాయని మచ్చే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంతో పాటు ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం తాజాగా లిక్కర్ స్కాం ఇలా పక్కాగా చంద్రబాబు పాత్రను తేల్చేసింది సీఐడీ. ఇది న్యాయస్ధానంలో రుజువైతే మాత్రం బాబు చాప్టర్ క్లోజేనని అంతా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -