Monday, May 20, 2024
- Advertisement -

ఆసక్తికరంగా చిత్తూరు జిల్లా రాజకీయాలు!

- Advertisement -

ఏపీలో చిత్తూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. అయితే వీరిద్దరి మధ్య బద్ద శత్రుత్వమే ఉంది. కానీ కూటమి పొత్తులో భాగంగా బీజేపీ నుండి కిరణ్ పోటీ చేస్తుండటంతో ఆయన తరపున చంద్రబాబు ప్రచారం నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇక ఈ జిల్లాలో 14 సీట్లు ఉండగా గత ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది.నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పరిశీలిస్తే తిరుపతి నుండి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ వైసీపీ తరపున పోటీ చేస్తుండగా కూటమి నుండి జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కూటమి తరపున సీపీఐ మురళి పోటీ చేస్తున్నారు.

కుప్పంలో చంద్రబాబు ఎనమిదోసారి పోటీ చేస్తుండగా వైసీపీ తరపు ఎమ్మెల్సీ భరత్ బరిలో ఉన్నారు. ఇక కుప్పం అసెంబ్లీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్…భరత్ గెలిస్తే మంత్రిని చేస్తానని హామీ కూడా ఇచ్చారు. పలమనేరులో వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎన్‌ వెంకటేగౌడతో టీడీపీ ఎన్‌ అమరనాథరెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే మరో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో టీడీపీ చల్లా రామచంద్రారెడ్డి తలపడుతుండగా బీసీవై పార్టీకి చెందిన బి రామచంద్ర యాదవ్, కాంగ్రెస్‌కు చెందిన మురళీమోహన్ యాదవ్‌తో పాటు మరో నలుగురు అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. పీలేరులో వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీ రామచంద్రారెడ్డితో టీడీపీ నుంచి ఎన్‌ కిషోర్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి బీ సోమశేఖర్‌రెడ్డితో పాటు 12 మంది పోటీ చేస్తున్నారు.

మదనపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ నిస్సార్‌ అహమ్మద్‌తో టీడీపీ షాజహాన్‌ బాషా తలపడుతుండగా తంబళ్లపల్లె నుంచి వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పి.ద్వారకాంతారెడ్డితో టీడీపీకి చెందిన డి.జయచంద్రారెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన ఎంఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ టీడీపీ రెబల్ అభ్యర్థి కూడా బరిలో ఉండటం విశేషం.

పూతలపట్టు రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు ఉండగా, కె మురళీమోహన్ (టిడిపి), పి సునీల్ కుమార్ (వైఎస్‌ఆర్‌సిపి), కాంగ్రెస్‌కు చెందిన ఎంఎస్ బాబు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. జిడి నెల్లూరు రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు పోటీ చేయగా, విఎం థామస్ (టిడిపి), కృపా లక్ష్మి (వైఎస్‌ఆర్‌సిపి), రమేష్ బాబు (కాంగ్రెస్) పోటీలో ఉన్నారు.

నగరి నుంచి ఏడుగురు పోటీ చేస్తుండగా ఆర్కే రోజా (వైఎస్‌ఆర్‌సీపీ), జి భానుప్రకాష్‌ (టీడీపీ), రాకేష్‌రెడ్డి (కాంగ్రెస్‌) పోటీలో ఉన్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని (టిడిపి), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి (వైఎస్‌ఆర్‌సిపి), కె శ్రీనివాసులు (కాంగ్రెస్), శ్రీకాళహస్తి స్థానానికి వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీ మధుసూదన్‌రెడ్డి, టీడీపీ నుంచి బీ సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పీ రాజేష్‌తోపాటు మరో 13 మంది పోటీ చేస్తున్నారు. సత్యవేడు రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్‌లో ఈసారి టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కె. ఆదిమూలంతో 15 మంది పోటీ పడుతుండగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎన్‌ రాజేష్‌, కాంగ్రెస్‌ నుంచి బీబాబు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి సత్తా చాటిన వైసీపీ ఈసారి అవే ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -