Saturday, May 18, 2024
- Advertisement -

ఫైబర్ నెట్ కేసు..బాబుకు దక్కని రిలీఫ్

- Advertisement -

ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిలీఫ్ దక్కలేదు. ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. స్కిల్ స్కాం, క్వాష్ పిటిషన్‌లో కొన్ని అంశాలు ఫైబర్ నెట్ కేసుతో ముడిపడి ఉన్నాయని…క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ చేస్తం అని న్యాయస్థానం వెల్లడించింది. అనంతరం విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

ఇక స్కిల్ స్కాం కేసులో బాబు క్వాష్ పిటిషన్‌ పై ఈ నెల 23 లోగా తీర్పు వచ్చే అవకాశం ఉండగా సుప్రీంకోర్టులో కేసు ముగిసే వరకు అరెస్టు చేయబోమన్న నిబంధనలు కొనసాగించాలని వాదించారు చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా. ఇక ఫైబర్ నెట్ బెయిల్ పిటిషన్‌ పై విచారణను 23కి వాయిదా వేస్తే దానిని 30వ తేదీ వరకు పొడగించామని అడిగారు లూథ్రా. ఆయన ఎందుకిలా అడిగారో ఎవరికి అర్థం కాలేదు. ఒకవేళ సుప్రీంలో బాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయితే తర్వాత ఏం చేయాలి అన్న నేపథ్యంలోనే ఆయన 30వ తేది విచారణకు అడిగినట్లు తెలుస్తోంది.

ఇక ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించగా హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారు చంద్రబాబు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఫైబర్ నెట్ ప్రాజెక్టు టెండర్ల కేటాయింపులో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని, ఆయన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాఫ్ట్‌కు నిబంధనలు ఉల్లంఘించి లబ్ది చేకూర్చారని ఆరోపణలు రావడంతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ప్రధానంగా బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడంతో బాబు అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -