మనం తినే ఆహారంపైనే.. మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా నేటి కల్తీ ప్రపంచంలో అవగాహన లేకుండా తీసుకుంటున్న ఆహార పదార్థాల మూలంగా ఎన్నో ఆనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే సమతుల్యాహారం తీసుకున్నప్పుడే ఎన్నో రకాల వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇక తాజాగా చేసిన ఓ అధ్యయనంలో.. చేపలు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని వెల్లడైంది. వారంలో రెండు సార్లు మన ఆహారంలో చేపలు ఉండేలా చూసుకుంటే గుండె పోటు, గుండె సంబంధింత అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చని పరిశోధన వెల్లడించింది. చేపల్లోఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లే ఈ వ్యాధులను దూరంగా ఉంచుతాయని తెలుపుతున్నారు.
అయితే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న చేపలను తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు వెళ్లడిస్తున్నారు. అలాగే సీవీడి ప్రమాదం ఉన్న వారు చేపలను తినడం మంచిదని చెబుతున్నారు. కాగా ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడేవారు చేపలను తినడం మూలంగా మంచి ఫలితాలు కూడా వచ్చాయని యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ , ఈ అధ్యయన బృంద సభ్యుడు ఆండ్రూ మెంటే వెల్లడించారు. గుండె జబ్బులు ఉన్నవారు నూనెలు, కొవ్వు పట్టివున్న చేపలను తినాలని ఆయన సూచిస్తున్నారు.
బుల్లితెరపై దేవిశ్రీ ప్రసాద్ అదుర్స్ !
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !
అరటి తొక్కతో ఇన్ని ప్రయోజనాలున్నాయా !