Monday, May 20, 2024
- Advertisement -

అసలు బాబు లాయర్లు మిస్సవుతుందేంటి?

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి 40 రోజులు కావొస్తుంది. కానీ ఇప్పటికి చంద్రబాబు విడుదలపై క్లారిటీ లేదు. ఇక బెయిల్ కోసం బాబు తరపు లాయర్లు చేయని ప్రయత్నం లేదు. సీఐడీ కోర్టు దగ్గరి నుండి హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు వెళ్లారు కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఓ వైపు బెయిల్ పిటిషన్…మరోవైపు క్వాష్ పిటిషన్ వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఇక బాబు రిమాండ్‌లో ఉండగానే ఆయనపై అనేక కేసులు ఇన్నర్ రిండ్ రోడ్డు స్కాం, ఫైబర్ నెట్ స్కాం,అంగళ్లు కేసు ఇలా పలు కేసుల్లో ఏ1గా ఉన్నారు. ప్రతి రోజు చంద్రబాబు తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం అది వాయిదా పడటం ఆనవాయితీగా వస్తుండటంతో టీడీపీ శ్రేణులు సైతం పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది.

అయితే అసలు బాబుకు బెయిల్ వస్తుందా? చంద్రబాబు తరపు లాయర్లు మిస్సవుతుందేంటి అన్న ప్రశ్న అందరిలో ఉంది. చిన్నా చితకా మొత్తం కలిపి మొత్తం 40 మంది లాయర్లు బాబును బయటకు తీసుకొచ్చేందుకు లా పుస్తకాలు తిరగేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక బెయిల్ కోసం చంద్రబాబు కోట్లలో ఖర్చు పెడుతున్నా ఏం మాత్రం ప్రయోజనం ఉండట్లేదు. గంటకు లక్షలు తీసుకునే లాయర్లను బరిలోకి దించిన ఉపయోగం లేకపోయింది.

ఓ సారి చంద్రబాబు ఆరోగ్యం, మరోసారి ఆయన భద్రత, ఇంకోసారి దోమల దండయాత్ర ఇలా ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారే తప్ప అసలు కేసులో బాబుకు సంబంధంలేదని నిరూపించలేకపోతున్నారు. అసలు ఏ ఆధారాలూ లేకుండా బాబుని జైలులో ఎందుకు ఉంచుతున్నారు..ఎంతసేపు 17ఏ గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నారు అన్నది టీడీపీ నేతలను కలిచివేస్తున్న ప్రశ్న. చంద్రబాబు ప్రమేయం లేదని ఎందుకు నిరూపించలేకపోతున్నారు…ఆలస్యం అవుతున్నా కొద్ది ప్రజల్లో చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే బెయిల్ రాలేదని అనుకోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి బాబు తరపు లాయర్లు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -