Sunday, May 19, 2024
- Advertisement -

పవన్‌ ప్రచారం..ఆ ఒక్క స్థానంకే పరిమితమా?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారంలో నువ్వానేనా అన్నట్లు దూసుకుపోతున్నాయి బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇక ఈ రేసులో కాస్త వెనుకబడింది బీజేపీ – జనసేన కూటమి. ఇక పవన్‌ ప్రచారంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది బీజేపీ. కానీ ఇప్పటివరకు ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారు కాలేదు. అసలు పవన్ ప్రచారం చేస్తారా…ఒకవేళ చేస్తే ఎన్ని నియోజకవర్గాల్లో చేస్తారు అన్న దానిపై క్లారిటీ లేదు.

రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న బీసీ ఆత్మగౌరవ సభలో తప్ప పవన్‌ కళ్యాణ్ ఎక్కడ కనపించలేదు. తమ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించింది లేదు. అయితే ఈ నెల 26న పవన్ హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. అదేరోజు కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమక్ కుమార్ తరపున ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఆ ఒక్క నియోజకవర్గంలోనే ప్రచారం చేస్తారా లేదా బీజేపీ పోటీ చేసే స్థానాల్లో కూడా ప్రచారం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

వాస్తవానికి జనసేన 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి చివరికి బీజేపీతో పొత్తులో భాగంగా కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. దీంతో తెలంగాణ జనసేన నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఇచ్చిన 8 స్థానాల్లో ముగ్గురు బీజేపీ నుండి వచ్చిన వారే కావడం విశేషం. అయితే పవన్ ఎన్నికల ప్రచారం ముగిసే 2 రోజుల ముందే తెలంగాణకు వస్తుండటంతో ఆ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -