Monday, May 20, 2024
- Advertisement -

వైసీపీ బస్సుయాత్ర టూర్ షెడ్యూల్..

- Advertisement -

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల్లోనే ఉండేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు చంద్రబాబు అవినీతిని ఎండగడుతునే మరోవైపు ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలకు కీలకమైన ఈ 6 నెలలు బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉండనున్నారు వైసీపీ నేతలు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

ఈ నేపథ్యంలో వైసీపీ సామాజిక బస్సుయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. అక్టోబర్ 26 నుంచి 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర జరగనుంది. ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర మొదలుకానుండగా అనకాపల్లిలో ముగియనుంది. తొలి విడత 13 రోజుల పాటు ఈ యాత్ర జరగనుండగా ప్రతి నియోజకవర్గంలో బహిరంగసభలను నిర్వహించనున్నారు. నెల 26 న ఇచ్చాపురంలో, 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస, నవంబర్ 1న పార్వతీపురం, నవంబర్ 2న మాడుగుల, నవంబర్ 3న నరసన్నపేట, నవంబర్ 4న శృంగవరపు కోట, నవంబర్ 6న గాజువాక, నవంబర్ 7న రాజాం, నవంబర్ 8న సాలూరు, నవంబర్ 9న అనకాపల్లిలో బస్సుయాత్ర జరగనుంది. మొత్తంగా వరుస కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉంటూ వైసీపీకి మరింత ఓటు బ్యాంకు పెరిగేలా చేస్తుండగా వైసీపీ ముందస్తు వ్యూహంతో టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -