Sunday, May 19, 2024
- Advertisement -

పవన్‌కు జేడీ ఎఫెక్ట్..నేతలంతా క్యూ!

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భౄరత్ నేషనల్ పార్టీ స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమన్న అంబేద్కర్ స్పూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు. ఇక ఎవరి పొత్తు లేకుండా 175 స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు.

దీంతో ఇప్పుడు అసంతృప్తులను అడ్డాగా మారింది జేడీ లక్ష్మీనారాయణ పార్టీ. ప్రధానంగా టీడీపీ – జనసేనలోని అసంతృప్తులు జేడీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జనసేన నేతలు టీడీపీతో పొత్తుతో ఎక్కువ మంది నష్టపోతుండటంతో వారంతా జేడీతో భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జేడీకి ప్రజల్లో క్లీన్ ఇమేజ్ ఉంది. 2019లో జనసేన నుండి విశాఖ లోక్ సభ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనసేనకు దూరమై స్వతంత్య్రంగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే జనసేన నేతలతో జేడీకి వ్యక్తిగత సంబంధాలు ఉండటంతో ఇప్పుడు వారంతా జేడీ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీలో టికెట్లు రాని వారు ఎటూ వెళ్లరు..ఇక జనసేన – టీడీపీ పొత్తులో లాభం టీడీపీకే. ఎటూ నష్టపోయేది జనసేన నేతలే కాబట్టి వారు ఇప్పటినుండే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. మొత్తంగా జేడీ పార్టీ పవన్‌కు ఎసరు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -