Tuesday, May 21, 2024
- Advertisement -

ఇప్పట్లో ఏపీకి రానంటున్న లోకేష్!

- Advertisement -

ఏదో సాధిద్దామని ఢిల్లీకి వెళ్లారు…కానీ అక్కడ ఏం చేయలేక, తిరిగి ఏపీకి రాలేక నారా లోకేష్ పడుతున్న బాధ వర్ణణాతీతం. ఈ మాటలు అంటుంది ఎవరో కాదు..తెలుగు తమ్ముళ్లే. ఏ టైంకి జగన్‌ విదేశాలకు పయనమయ్యారో అప్పుడే టీడీపీకి బ్యాట్ టైం స్టార్ట్ అయింది. అప్పటికి చంద్రబాబు నంద్యాలలో ప్రజా క్షేత్రంలో ఉండగా నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. దీంతో టీడీపీకి ఇక తిరుగులేదనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఒకే ఒక్క అరెస్ట్‌తో టీడీపీ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.

టీడీపీ అధినేత చంద్రబాబు మెడకు అవినీతి కేసులు ఉచ్చులా బిగుస్తుండటంతో ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు తరపు లాయర్లు బెయిల్ కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నా ఫలితం లేని పరిస్థితి. ఇక బాబుకు మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీకి వెళ్లిన లోకేష్..ఏపీకి ఎప్పుడు వస్తారో తెలియని సిచ్యువేషన్. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఢిల్లీ నుండే పార్టీ నేతలను మానిటరింగ్ చేస్తున్నారు లోకేష్. అయితే లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తున్నాయా అంటే సమాధానం లేని ప్రశ్నే. పార్లమెంట్ వేదికగా గళం విప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక ఏపీ అసెంబ్లీలో టీడీపీ వాయిస్ వినిపిస్తారనుకున్నా ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించారు. దీంతో వైసీపీకి ఇది పూర్తిగా అడ్వాంటేజ్‌గా మారింది. చంద్రబాబు అవినీతిని కళ్లకు కట్టినట్లు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరిన్ని రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారట లోకేష్. హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంను ఇప్పటికే ఆశ్రయించింది టీడీపీ. దీంతో సుప్రీం కోర్టు న్యాయవాదులను కలుస్తు బాబుకు బెయిల్‌ తీసుకువచ్చే ప్రయత్నాలను తీవ్రం చేయాలని లోకేష్ భావిస్తున్నారట. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు చెబుతూ ఇప్పట్లో ఏపీకి రానని చెబుతున్నారట. మరి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -