Thursday, May 16, 2024
- Advertisement -

మార్గదర్శి మోసాల మయం..!

- Advertisement -

మార్గదర్శిలో మోసపోయాక గళం విప్పడం ప్రారంభించామన్నారు మార్గదర్శి బాధితుల సంఘం అధ్యక్షుడు ముష్టి శ్రీనివాస్.పేద మధ్య తరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు…షూరిటీస్ నెపంతో డబ్బు ఎగ్గొడుతున్నారన్నారు.చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నారు…మార్గదర్శి ఎప్పుడు దివాళా తీస్తుందో తెలియట్లేదు అన్నారు.

50మందితో చీటీ ప్రారంభిస్తున్నాం అని చెప్పి 20 నుండి 25మందితోనే స్టార్ట్ చేస్తున్నారు…పేద మధ్య తరగతి ప్రజల సొమ్ము ను దోచుకుంటున్నారు అన్నారు. ప్రతీ గ్రూపుకు ఒక అకౌంట్ మెయింటైన్ చెల్సి ఉన్నా అనేక గ్రూపులకు ఒకే అకౌంట్ మెయింటేన్ చేస్తున్నారన్నారు. మిగిలిన సబ్ స్క్రైబర్లకి తెలియకుండా చీటీ లు పాడేస్తున్నారు…డబ్బు మొత్తం కలెక్ట్ చేసి బ్రాంచ్ లలో ఉంచకుండా ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారన్నారు.

మార్గదర్శి అనైతికంగా వ్యవహరిస్తోందన్నారు మార్గదర్శి బాధితుల సంఘం వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు. కస్టమర్ల ఆస్తులు కొల్లగొడుతున్నారు…43 చిట్లలో కేవలం నాకు వచ్చింది 8వేలు…ఒక్కో చిట్ కి 210 రూపాయలు ఇచ్చారన్నారు. నెలకు 40నుండి 50 లక్షల ఇన్ స్టాల్ మెంట్ కట్టాల్సిన పరిస్థితి కి తీసుకెళ్లారు…చిట్ డిఫాల్ట్ అయితే ఆస్తులు అమ్ముకుంటారని మాకు తెలియదు అన్నారు. కోర్టుకు వెళ్తారనే భయంతో అప్పులు చేసి చిట్ లు కట్టాము …కాల్ మనీ గుండాల్లా మా ఇంటికి వచ్చి కూర్చునే వారు అన్నారు. ఇంట్లోని బంగారం అమ్ముకున్నాం….డిఫాల్ట్ అయితే ఇంత దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తారనిమాకు తెలియదు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -