Saturday, May 18, 2024
- Advertisement -

మళ్ళీ ఉత్తుత్తి గాలి మాటలేనా?

- Advertisement -

ఎన్నికల టైంలో జస్ట్ ప్రచారం అంటే.. మన పాలన పై జనాల్లో నమ్మకం కలిగేలా ఉండాలి. 5 ఏళ్ళ పాలనలో మనం చేసింది ఏంటో? ప్రజలు పొందిన లాభం ఏంటో గుర్తుచేయాలి. నిజమే కదా అని వారు కూడా అలెర్ట్ అవుతారు. అలాగే ఉండాలి. కానీ కొత్త కొత్తగా ఏవో హామీలు వంటివి ఇచ్చేసి.. గెలిచాక మొహం చాటేస్తే.. ఎక్కడ బెండు తీయాలో జనాలకి బాగా తెలుసు. ఫైనల్ గా ఓటేసే ఓటరే కింగ్. ఎన్ని గాలి కబర్లు చెప్పినా జనాలు నమ్మేసి ఓట్లు వేసే స్థితిలో ఇప్పుడు లేరు. వాళ్ళు ఎవరేం చెప్పినా వింటారు. చివరికి వారికి నమ్మకం ఉన్నవారికే ఓటేస్తారు. ఆ నమ్మకం ఇప్పుడు జగన్ పై ఉంది అనేది వాస్తవం.

కానీ 2019 ఎన్నికల్లో ఘోరంగా పడిపోయిన టీడీపీ గ్రాఫ్… పెంచేందుకు చంద్రబాబు ఏవేవో గాలి కబుర్లు చెబుతున్నారు అనే డిస్కషన్లు ఇప్పుడు సర్వత్రా జరుగుతున్నాయి.కానీ చంద్రబాబు మాత్రం హామీలు ఇస్తూ పోతున్నారు. సరే పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏ రాజకీయ నాయకుడైనా చెప్పేవే. అందులో తప్పేం లేదు. కానీ తలకి మించిన భారం జనాలపై పడకుండా చూడాల్సిన బాధ్యత ఆయన పై ఉందనేది కూడా ఆయన గ్రహించాలి. గ్రామస్థాయిలో ప్రజలు వైయస్ జగన్నే మళ్ళీ గెలిపించాలి అని అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో మౌత్ టాక్ మల్లిగాళ్ళ మాదిరి వచ్చి ఫేక్ హోప్స్ చూపిస్తే వాళ్ళు ఎలా నమ్ముతారు. ఇదంతా ‘ఉత్తుత్తి ప్రచారమే’ అంటూ కాసేపు నవ్వేసుకుని ఊరుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -