Monday, May 20, 2024
- Advertisement -

ఏపీలో రాజకీయ అనిశ్చితి…జగన్‌దే పైచేయి?

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్‌ 40 రోజులు దాటింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉండగా టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. ఇక బాబుపైఅవినీతి మరక,రిమాండ్‌తో ఏపీలో ముఖ్యంగా టీడీపీలో రాజకీయ శూన్యత నెలకొంది. ఇక టీడీపీ నేతలు అడపదడప కార్యక్రమాలను ప్రకటిస్తున్న ప్రజల నుండి మద్దతు రావడం లేదు. దీంతో ప్రస్తుతం టీడీపీ నేతల ఫోకస్ అంతా చంద్రబాబును జైలు నుండి బయటకు తీసుకురావడం అనే దానిపైనే ఉంది.

ఇక టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనకు ప్రజల మద్దతు రాకపోగా వారికి ఇబ్బందులు కలిగించేలా ఉండటంతో ఆ పార్టీ నేతలపై కేసులు నమోదయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ నేతలంతా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇక టీడీపీకి ఒక్క జనసేన తప్ప మిగితా విపక్ష పార్టీల మద్దతు కూడా కరువైంది. బీజేపీ సంగతి చెప్పనక్కర్లేదు. చంద్రబాబు రిమాండ్‌ నలబై రోజులు కావొస్తున్న ఆ విషయంతో మాకు సంబంధంలేదనే దోరణిలోనే ఉన్నారు కాషాయ పార్టీ నేతలు.

ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా యాక్టివ్‌గా అయినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. వారాహి యాత్రతో హంగామా చేద్దామనుకున్న ప్రజలు పట్టించుకోలేదు. దీనికి తోడు టీడీపీతో పొత్తును నిరసిస్తూ జనసేన నేతలు పార్టీని వీడుతున్నారు.దీంతో పవన్ సైతం లేటుగానైన పొలిటికల్ క్రైసిస్‌ని అర్ధం చేసుకుని ఒంటరిగానే వైసీపీ సర్కార్‌కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏపీలో నెలకొన్న ఈ రాజకీయ అనిశ్చితి వైసీపీకి వరంగా మారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -