Saturday, May 3, 2025
- Advertisement -

సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్..తొలి టీ20 టీమిండియాదే

- Advertisement -

టీ20 కెప్టెన్‌గా తొలి విజయాన్ని అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. సూర్యసేన విధించిన 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. నిస్సనక(79), కుశాల్‌ మెండిస్‌ (45) రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో పరాగ్‌ (3/5), అర్ష్‌దీప్‌సింగ్‌ (2/24), అక్షర్‌పటేల్‌ (2/38) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఇక అంతకముందు టాస్‌ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 213/7 స్కోరు చేసింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 26 బం తుల్లో 2 సిక్స్‌లు, 8 ఫోర్లతో 58 పరుగులు చేయగా రిషబ్‌ పంత్‌ 33 బంతుల్లో 49, యశస్వి జైస్వాల్‌ 21 బంతుల్లో 40,శుభ్‌మన్‌ గిల్‌(34) పరుగులతో రాణించారు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది. సూర్యకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ టీ 20ల్లో 16 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు సూర్య.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -