Tuesday, May 7, 2024
- Advertisement -

ఫైనల్లో తిరుగులేని శ్రీలంక..భారత్ గెలిచేనా?

- Advertisement -

శ్రీలంకలోని కొలంబో వేదికగా ఇవాళ భారత్ – శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వాస్తవానికి శ్రీలంకపై పాక్ గెలిచి ఫైనల్ వస్తుందని అంతా భావించిన లంక ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో పాక్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక ఆసియా కప్‌ లో శ్రీలంకకు తిరుగులేదు. ఆసియా కప్ హిస్టరీలో ఇప్పటివరకు ఒక్క ఫైనల్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇక భారత్ గత ఐదేళ్లలో ఒక్క పెద్ద టోర్నీలోనూ విజయం సాధించలేదు. దీంతో ఇవాళ జరిగే ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ విజేతగా నిలవాలని అంతా కోరుకుంటున్నారు.

ఇప్పటి వరకు ఆసియాకప్‌లో అత్యధికంగా భారత్‌ ఏడుసార్లు విజేతగా నిలవగా ఆరుసార్లు ట్రోఫీని గెలుచుకుంది శ్రీలంక. భారత్ చివరిసారిగా 2018లో బంగ్లాను ఓడించి విజేతగా నిలిచింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో భారత్ పటిష్టంగా కనిపిస్తుండగా శ్రీలంక ఆటగాళ్లను గాయాల సమస్య వేధిస్తోంది. అయితే ఆసియాకప్‌లో భాగంగా కొలంబోలో జరిగిన గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే విజయం సాధించింది. దీంతో టాస్ కీలకం కానుంది. పిచ్‌ స్పిన్‌కు సహకరించనుండగా ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు జరుగుతున్న కీలక ఫైనల్ మ్యాచ్ కావడంతో ఈ రెండు జట్లకు గెలవడం చాలా ముఖ్యం.

జట్లు అంచనా..

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, కోహ్లీ, రాహుల్‌, ఇషాన్‌, పాండ్యా, జడేజా, శార్దూల్‌/సుందర్‌, కుల్దీప్‌, సిరాజ్‌, బుమ్రా

శ్రీలంక: షనక (కెప్టెన్‌), కుషాల్‌ పెరెరా, నిషాంక, కుషాల్‌ మెండిస్‌, సమరవిక్రమ, చరిత అసలంక, ధనంజయ, దునిత్‌, దుషన్‌, పతిరణ, కసున్‌ రజిత.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -