Tuesday, April 30, 2024
- Advertisement -

T20 WORLD CUP : సూర్య చాలా డేంజర్.. జాగ్రత్త గురూ !

- Advertisement -

యావత్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టి20 వరల్డ్ కప్ నేడు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభం అయినప్పటికి అసలు సిసలు క్రికెట్ మజాను తీసుకొచ్చే మ్యాచ్ మాత్రం ఈ నెల 23 న జరగనుంది. ఆ రోజు చిరకాల ప్రత్యర్థి దేశాలు ఇండియా పాకిస్తాన్ తలపడనున్నాయి. యావత్ క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే భారత్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో తలపడనుంది. ఇదిలా ఉంచితే ఈ టోర్నీలో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్ల జాబితాను వారి స్ట్రైక్ రేట్ ఆధారంగా ఐ‌సి‌సి ప్రకటించింది.

టాప్ 10 ఆటగాళ్లలో టీమిండియా తరుపున యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్ 176.81 స్ట్రైక్ రేట్ తో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఆ తరువాతి స్థానంలో 163.65 స్ట్రైక్ రేట్ తో న్యూజిలాండ్ జిమ్మీ నిశామ్ ఉన్నాడు. ఇక మూడో స్థానంలో కూడా మరో న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ 161.72 తో ఉన్నాడు. అయితే టాప్ 10 లో టీమిండియా నుంచి ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్పా మిగిలిన ఆటగాళ్ళేవ్వరు లేకపోవడం గమనార్హం. ఇక హార్డ్ హిట్టర్స్ గా పేరుగాంచిన హర్ధిక్ పాండ్య, దినేష్ కార్తీక్ కూడా సూర్య కుమార్ కంటే తక్కువే స్ట్రైక్ రేట్ కల్గి ఉన్నారు. పాండ్య 148.49 స్ట్రైక్ రేట్ కలిగి ఉండగా, దినేష్ కార్తీక్ 146.40 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. మరి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ అలాగే టోర్నీలో కొనసాగిస్తే.. ప్రత్యర్థి జట్లకు విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా గుర్తుండిపోవడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -