టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక టూర్‌కు వన్డే జట్టును ఎంపిక చేశారు గంభీర్. ఈ జట్టులో రవీంద్ర జడేజా, సంజు శాంసన్‌లకు చోటు ఇవ్వలేదు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రవీంద్ర జడేజాను ఎంపిక చేయలేదు. దీనిపై వివరణ ఇచ్చారు కోచ్ గంభీర్.
జడేజాను కావాలని తప్పించలేదని సెప్టెంబర్ నుంచి కీలక టెస్టు సిరీస్‌లు మొదలుకానున్న నేపథ్యంలో విశ్రాంతి ఇచ్చామని చెప్పారు. మూడు వన్డేల సిరీస్‌లకు ఎంపిక చేయనంత మాత్రాన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలో జడేజా లేనట్లు కాదని చెప్పాడు.
రుతురాజ్, అభిషేక్ విషయంలోనే కాదు, ఇతర ప్లేయర్లు జట్టులో స్థానం కోల్పోయినా కష్టంగానే ఉంటుందని తెలిపాడు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.
భారత జట్టులో పోటీతత్వం ఎక్కువగా ఉండటం వల్లే కొంతమంది ఆటగాళ్లు టీమ్‌లో చోటు దక్కదని అంత మాత్రాన వారి సామర్థ్యం తక్కువ ఉన్నట్లు కాదని తెలిపారు అజిత్ అగర్కార్. సెలెక్టర్లుగా జట్టులోకి 15 మంది ఆటగాళ్లను మాత్రమే తీసుకోగలమని చెప్పారు.
టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
