Sunday, May 5, 2024
- Advertisement -

సూర్య కుమార్.. ఇలా అయితే కష్టమే !

- Advertisement -

ప్రస్తుతం టీమిండియాలో యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ మద్య కాలంలో జరిగిన అన్నీ టి20 సిరీస్ లలోనూ సూర్య అద్భుతమైన గణాంకాలు నమోదు చేస్తూ ఐసీసీ టి20 ర్యాంకింగ్ లో టాప్ 2 లో కొనసాగుతున్నాడు. అయితే మొన్నటి వరకూ అత్యాదిక పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగిన స్కై (sky) ..తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ విఫలం కావడంతో ఒక స్థానం పడిపోయి రెండవ స్థానంలో నిలిచాడు. ఇక ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ మహ్మద్ రిజ్వాన్ 854 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా..838 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే టీమిండియా ప్రస్తుతం సూర్యకుమార్ పై భారీగానే ఆశలు పెట్టుకుంది. .

టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో సూర్య తన ఫామ్ కొనసాగించాలని తన సహచర ఆటగాళ్లతో పాటు టీమిండియా అభిమానులు సైతం గట్టిగానే కోరుకుంటున్నరు. ఇక సూర్య ఫామ్ గురించి రోహిత్ కూడా స్పందించాడు.. ” సూర్యకుమార్ గత ఏడాది కాలంగా అత్యద్భుతంగా రాణిస్తున్నడని.. కానీ సౌతాఫ్రికాతో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో కాస్త నిరాశ పరిచడాని.. తిరిగి తన ఫామ్ కొనసాగించాలని ” రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం నాల్గవ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న సూర్యకుమార్ టి20 వరల్డ్ కప్ లో కూడా తాను అదే స్థానంలో కొనసాగుతాడా అంటే అనుమానమే. ఎందుకంటే సౌతాఫ్రికాతో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో నాల్గవ స్థానంలో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేశాడు.. దీంతో నాల్గవ స్థానంలో ఎవరిది అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ నెల 16 నుంచి ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకోగా.. ఈ నెల 23న పాకిస్థాన్ తో తొలి మ్యాచ్ అడనుంది టీమిండియా.. మరి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న టీమిండియా.. టి20 వరల్డ్ కప్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -