Monday, May 6, 2024
- Advertisement -

కోహ్లీ గోల్డెన్‌ చాన్స్‌ మిస్‌..

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌లోకి ప్రవేశించింది టీమిండియా. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏడింట్లో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక…భారత బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయింది. ముఖ్యంగా సిరాజ్, షమీ ముందు లంక బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు. దీంతో 19.4 ఓవర్లలో కేవలం 55 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 302 పరుగుల తేడాతో గెలుపొందింది. రజిత (14), తీక్షణ (12 నాటౌట్‌), మాథ్యూస్‌ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా ఐదుగురు డకౌట్‌ అయ్యారు. మహమ్మద్‌ షమీ 5, సిరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టారు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన శ్రీలంక…భారత్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక ఆదిలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ వెనుదిరిగాడు.ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ మరో వికెట్ పడకుండా గిల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

గిల్‌ 92 బంతుల్లో 92, కోహ్లీ 94 బంతుల్లో 88 పరుగులు చేశారు. ఇక శ్రేయాస్ అయ్యార్ 56 బంతుల్లో 82 పరుగులు చేశారు. ముఖ్యంగా ఫోర్లు సిక్సర్లతో విరుచుకపడ్డాడు శ్రేయాస్. ఇక ఈ ముగ్గురు సెంచరీ మిస్ చేసుకోవడం విశేషం. బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కోహ్లీ సెంచరీని మిస్ చేసుకోవడం అందరిని నిరాశ పర్చింది. రెండు సెంచరీలు చేస్తే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు కోహ్లీ. సచిన్ 49 సెంచరీలతో ఉండగా కోహ్లీ 48 సెంచరీలు చేశాడు. షమీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా భారత్ తన నెక్ట్స్ మ్యాచ్‌ ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -