Saturday, May 18, 2024
- Advertisement -

ఎన్నికలొస్తే చాలు…ఆ టీడీపీ నేతల్లో టెన్షన్!

- Advertisement -

ఏపీలో మరో 6 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓ వైప చంద్రబాబు అరెస్ట్, చిన్న బాబు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం..మరోవైపు టీడీపీ-జనసేన పొత్తు వెరసీ తెలుగుదేశంలో నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఎన్నికలంటే టీడీపీకి గుర్తొచ్చేది పొత్తు.ఈ నేపథ్యంలో అప్పటివరకు నియోజకవర్గాల్లో తమకే టికెట్ వస్తుందని భావించిన కష్టపడ్డ నేతలకు పొత్తుతో టికెట్ దూరమయ్యే పరిస్ధితి. అయితే ఆ తర్వాత భవిష్యత్‌పై అధినేత చంద్రబాబు నుండి హామీ లభించని పరిస్థితి. టీడీపీ ఆవిర్భావం నుండి ఇదే జరిగింది.

అందుకే టీడీపీ నుండి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన చాలా మంది చంద్రబాబు వైఖరితో విసిగిపోయి ఇతర పార్టీల్లో చేరిపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలుగా ఇతర పార్టీల నుండి గెలవగా మరికొంతమంది క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా జనసేన -టీడీపీ పొత్తుతో మరికొంతమంది నేతలు పార్టీని వీడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పొత్తులో కొంతమంది టీడీపీ నేతలు టికెట్ కొల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న డిసైడ్ చేసేది ఉభయగోదావరి జిల్లాలే. ఎందుకంటే ఏపీలోని మొత్తం ఓటర్లలో 20శాతం ఓటర్లు గోదావరి జిల్లాల్లోనే ఉన్నారు. అందుకే ఇక్కడి నుండి ఏ పార్టీ గెలిస్తే అధికారం ఆ పార్టీకే సొంతం అనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో గోదావరి తీరంలో ఫ్యాన్ గాలి ముందు టీడీపీ కొట్టుకుపోయింది. ఇక జనసేన అయితే అడ్రసే గల్లంతైంది.అందుకే టీడీపీ-జనసేన మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

అయితే ఈ సారి టీడీపీ నేతలకు జనసేన రూపంలో సీటుపై ఎఫెక్ట్ పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గోదావరి జిల్లాలలో కాకినాడ రూరల్, కొత్తపేట, పిఠాపురం, భీమవరం, రాజోలు, అమలాపురం, రామచంద్రాపురం, రాజానగరం, రాజమండ్రి రూరల్ వంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది. కొన్ని చోట్ల నాయకత్వ సమస్య ఉన్నా జనసేన కేడర్ బలం ఎక్కువగా ఉండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనికి తోడు పవన్ భీమవరం నుండి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుండటంతో ఈ రెండు జిల్లాల నుండి ఎక్కువ సీట్లను జనసేన కొరుతోంది. దీంతో ఈ నియోజకవర్గాల్లో తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. అయితే ఏదిమైనా పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చినా అది ఆ పార్టీకి ప్లసే. ఎందుకంటే ఒక్కరు కూడా ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లు లేరు. ఎటు వచ్చి ఇబ్బంది టీడీపీ నేతలకే. ఏదిఏమైనా ఎప్పటిలాగే జగన్‌ను ఓడించే పేరుతో సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి టీడీపీ నేతల్లో ఉంది.

ఎన్నికలొస్తే ఛాలు…ఆ టీడీపీ నేతల్లో టెన్షన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -