Saturday, May 18, 2024
- Advertisement -

టీడీపీ ఎంపీ అభ్యర్థి చిన్ని ఎన్నికల ప్రచారం సంగతేంటి?

- Advertisement -

కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఎన్నికల పచ్రారం గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఎన్నికల కోడ్ ప్రకటించి 15 రోజులు కావస్తున్నా ఆయన ప్రచారంలో భాగం కాలేదు అనేది కొందరి అభిప్రాయం.టీడీపీ నాయకులు సైతం ఈ విషయం పై కొంచెం గట్టిగానే చర్చించుకుంటున్నారు అని వినికిడి. వైసీపీ అభ్యర్థి కేశినేని నాని ఇప్పటికే రూరల్ ప్రాంతంలో 2 సార్లు విస్తృత పర్యటన చేయగా ‘నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలున్నాయో నానికి తెలుసా’ అంటూ సవాల్ విసిరిన చిన్ని గ్రామాల్లోకి వెళ్ళకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏప్రిల్ 14 న, 18న మైలవరం అభ్యర్థి వసంతతో కనిపించిన చిన్ని మరోసారి మళ్ళీ మైలవరం ముఖం చూడలేదనే అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత నెల 20వ తేదీన నందిగామలో కనిపించిన కేశినేని చిన్ని మళ్ళీ అక్కడ ప్రచారంలో 10 రోజులు కనపడలేదట. 17వ తేదీన జగ్గయ్య పేటలో ఓసారి అలా మెరిసినట్లు వచ్చి వెళ్లిపోయిన చిన్ని విజయవాడ తూర్పులో 20వ తేదీన చిన్ని కనిపించారు.సెంట్రల్ నియోజకవర్గంలో కనీసం అడుగు పెట్టలేదు 19 న కేశినేని చిన్ని తన నామినేషన్ తర్వాత తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ అభ్యర్థులు నామినేషన్లలో కాసేపు కనిపించారు.

చిన్ని నామినేషన్ కార్యక్రమంలో కనిపించని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎందుకిలా జరుగుతోంది.అయితే గత నెల రోజులుగా విజయవాడ పశ్చిమలో తన సోదరి, తనయుడు , తానూ కూడా వరుసగా పచ్రారం చేస్తూ వస్తున్నారు. పశ్చిమ కూటమి అభ్యర్ధితో కాకుండా తన దారిన తాను పచ్రారం చేసుకోవడం కూడా టీడీపీ శ్రేణులకు అర్థం కాని సమస్యగా ఉంది అక్కడ స్థానిక నాయకులు బుద్దామీరాలు కూడా చిన్నితో కాకుండా సుజనా చౌదరితో ప్రచారంలో పాల్గొంటున్నారనేది మరో చర్చ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది…చిన్ని ఆలోచన ఏమిటి?? విజయవాడ పశ్చిమలో మాత్రమే చిన్ని పచ్రారం ఎందుకు చేస్తున్నారు ?? మిగిలిన ఆరు నియోజకవర్గాల నాయకులకి చిన్నికిపోసగటం లేదా?? చిన్ని చేయించుకున్న సర్వే ఫలితాల్లో ఏముంది?అసలు బరిలో ఉన్నా డా?? ఉన్నది పది రోజులు 280 గ్రామాలు 64 డివిజన్లు, 14 కొండ ప్రాంతాలు ఇంకెప్పుడు పచ్రారం చేస్తారు? ఈ ప్రశ్నలకి చిన్ని ఎప్పుడు.. ఎలా సమాధానం ఇస్తారో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -