Sunday, May 19, 2024
- Advertisement -

ఏపీనా..తెలంగాణ?!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ నుండి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. అయితే ఎంతోమంది నేతలకు పార్టీలో చేరడానికి లైన్ క్లీయర్ అవుతున్న వైఎస్ షర్మిలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. రెండు రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియాను కలవనున్న షర్మిల…తన పార్టీ విలీనంపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.

అయితే పార్టీలో చేరడం వరకు బాగానే ఉన్నా ఆమె సేవలను ఏపీలో వినియోగించుకోవడానికే మొగ్గుచూపుతోంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఇది ఫస్ట్ నుండి షర్మిల ముందున్న ఆన్సర్ లేని క్వశ్చనే. ఎందుకంటే ఒకవేళ ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే షర్మిలతో పాటు విజయమ్మకు ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే అన్న జగన్‌పై విమర్శలు చేయాల్సి వస్తుంది. దీనిని రాజకీయ ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే ఈ ఒక్క విషయంలోనే షర్మిల డైలామాలో ఉన్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా రేవంత్ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం కూడా ఇదే. షర్మిల తెలంగాణలో ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు మైనస్ అవుతుందని..ఆమెను ఏపీకే పరిమితం చేయాలని చెప్పారు కూడా. అయితే కాంగ్రెస్ మాత్రం తొలుత ఆమెను పార్టీలో చేర్చుకుని తర్వాత ఆమె సేవలను ఎక్కడ వినియోగించుకోవాలో నిర్ణయించాలని భావిస్తుందట. ఈ నెలాఖరులోపే షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టమైన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉండగా మరి రానున్న కాలంలో షర్మిల ఏం చేస్తారో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -