Monday, April 29, 2024
- Advertisement -

ఈ ఫొటోలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను దక్కించుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగులు వాయిదా పడటంతో సినీ తారలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు.

రష్మిక కూడా పుష్ప సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉండిపోయారు. సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తుంటారు. రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో సినీ తారలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ కరోనా బారిన పడి కోలుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:లాక్‌డౌన్‌ లో బిగ్ బాస్ షూటింగ్… సీల్ చేసిన పోలీసులు!

గత ఏడాది కంటే ప్రస్తుతం ఎంతో భయంకరంగా వ్యాపిస్తున్న ఈ మహమ్మారి ఈ ప్రపంచం నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందా అంటూ ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. రష్మిక కూడా అదే ఫీలింగ్ లో ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పడం కోసం రష్మిక తన చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కరోనా వైరస్ పై తనకున్న అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రియమైన కరోనా ఈ ప్రపంచం వదిలి నువ్వు ఎప్పుడు వెళ్తావని ఎదురు చూస్తున్నా అంటూ తెలియజేశారు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన “పుష్ప” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:అది మాటల్లో చెప్పలేని బాధ.. ఆందోళనలో నటి పాయల్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -