Monday, April 29, 2024
- Advertisement -

బాలకృష్ణ సరసన ఆ బ్యూటీ.. సినిమాలో కీలక పాత్ర!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడుగా పేరు సంపాదించుకున్న బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ లో టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో మొట్టమొదటి సారిగా బాలకృష్ణ అగోర పాత్రల్లో కనిపించనున్నారు.ఇకపోతే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వినిపించాయి.

బోయపాటి అఖండ పూర్తయిన తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలోనే 90లలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న నటి మీనాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో బాలకృష్ణతో కలిసి “ముద్దుల మొగుడు”,”బొబ్బిలి సింహం” వంటి సినిమాలలో బాలకృష్ణతో మీనా జతకట్టింది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరూ గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు.

Also read:అనుపమ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు ఇవే!

కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్లలో మీనా ఓ కీలక పాత్రలో సందడి చేయనుందట. ఆమె పాత్ర సినిమాకి ఎంతో కీలకమవుతుందనే సమాచారం నిలబడుతుంది. ప్రస్తుతం మీనా వెంకటేష్ సరసన దృశ్యం 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మీనా బాలకృష్ణ సినిమాలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం వచ్చే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also read:బిగ్ బాస్ సీజన్ 5 ఏ నెలలో వస్తుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -