Thursday, May 9, 2024
- Advertisement -

అఖిల్‌ కంటే శ్రియ భూపాల్‌ ఎంత పెద్దదో తెలుసా?

- Advertisement -
age difference between akhil and sriya bhupal

ఇటివలే అక్కినేని వారి ఇంట పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్‌కు ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె శ్రియ భూపాల్‌తో వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని అఖిల్‌ కంటే అతనికి కాబోయే భార్య శ్రియ భూపాల్‌ నాలుగు సంవత్సరాలు పెద్దదట. అయితే వీరిద్దరు ప్రేమించుకోవడం వల్ల వయస్సు సమస్య కాలేదు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి.

కాని అఖిల్‌ మరియు శ్రియల సన్నిహితుల నుండి ఈ విషయం లీక్‌ అయ్యింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఎత్తున విదేశాల్లో వీరి వివాహం జరుగబోతున్న విషయం తెల్సిందే. పెళ్లి ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ రాలేదు. కాని పెళ్లి అత్యంత వైభవంగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చాలా మంది తమకంటే వయస్సు ఎక్కువ ఉన్న అమ్మాయిలను చేసుకున్నారు. వారు అంతా కూడా సంతోషంగా ఉన్నారు. అఖిల్‌ కూడా శ్రియతో సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఇక అఖిల్ నటించబోయే రెండో సినిమా కూడా వచ్చే సంవత్సరం రాబోతుంది. అక్కినేని ఫ్యామిలీకి మనం వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన విక్రమ్ కూమర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ రెండో సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా అక్కినేని నాగర్జున నిర్మిస్తున్నారు.

Related

  1. అఖిల్, శ్రీయ నిశితార్ధ ఫంక్షన్ లో ఉపాసన..?
  2. అఖిల్ లవర్ గురించి తెలిస్తే షాక్ అవుతారు!
  3. అఖిల్ రెండో సినిమా కథ ఇదే!
  4. నితిన్ కి ఆఫర్ ఇచ్చిన అఖిల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -