Tuesday, May 7, 2024
- Advertisement -

అఖిల్‌ కి ఊహించని షాక్ ఇచ్చిన నితిన్‌!

- Advertisement -

అక్కినేని అఖిల్ మొదటి చిత్రం ‘అఖిల్‌’ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరగా ప్లాప్ అయ్యింది. దాంతో అఖిల్ తన రెండో సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అఖిల్ రెండో సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం చేయాలి అని అనుకున్నాడు. ఊపిరి వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి ఒక మంచి కథతో అఖిల్‌ రెండవ సినిమాను తెరకెక్కిస్తాడు అంటూ ప్రచారం జరిగింది.

అయితే అఖిల్‌ మాత్రం తన రెండో సినిమాని హను రాఘవపూడి డైరెక్షన్ లో చేయాలి అని చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. అందుకోసం దర్శకుడు హను స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి చేశాడు. ఇటీవలే తాను హను దర్శకత్వంలో నటించబోతున్నట్లు స్వయంగా అఖిల్‌ ప్రకటించాడు. హను స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసిన తర్వాత అఖిల్‌ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. అఖిల్‌ తన రెండవ సినిమాను హోం బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేయాలని కోరుకుంటున్నాడు.

కానీ.. దర్శకుడు హను మాత్రం ఈ సినిమాని 14 రీల్స్‌ బ్యానర్‌లో చేయాలని కమిట్‌ అయ్యాడు. అఖిల్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌, హను 14 రీల్స్‌ అంటూ పట్టుబట్టడంతో మొత్తానికే సినిమా క్యాన్సిల్‌ అయినట్లుగా తెలుస్తోంది. అయితే అఖిల్‌ వదులుకున్న ఈ సినిమాలో ఇప్పుడు నితిన్‌ వచ్చి చేరాడు. నితిన్‌ 14 రీల్స్‌ బ్యానర్‌లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడు అతి త్వరలోనే హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్‌ పతాకంపై నితిన్‌ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. దాంతో అఖిల్ మరో దర్శకుడి కోసం చూస్తున్నాడు.

Related

  1. ఎవరీ అఖిల్ లవర్?
  2. నాగ్ కి అఖిల్ పెద్ద షాక్ ఇచ్చాడు!
  3. అక్కినేని అఖిల్ ని రోడ్డుకి లాగిన మంచు లక్ష్మి.
  4. అఖిల్ కు కోపం వచ్చింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -