అక్కినేని హీరో అఖిల్ కి పరిశ్రమలో మంచి పేరు ఉంది. చేసింది ఒక్కటే సినిమా.. అది ప్లాప్ అయిన.. అఖిల్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఇక అఖిల్ కొత్త సినిమాను గ్రాండ్ లెవెల్ లో లాంఛ్ చేయాలని అనుకున్నారు నాగార్జున. అయితే అఖిల్ రీలాంఛ్ ఈవెంట్ పేరుతో అక్కినేని అభిమానులతో పెద్ద పండుగ చేయాలని ప్లాన్ చేశారు.
కానీ అనుకోని విధంగా ఎంగేజ్మెంట్ జరిగాక అఖిల్ తన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. అక్కడి నుంచి మీడియా కంటబడకుండా జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. మీడియాకి ఎదురైతే.. తనకు ఎదురయ్యే ప్రశ్నలు ఏవో తెలుసు కాబట్టే ఎస్కేప్ అవుతున్నాడని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అఖిల్ సెకండ్ లాంఛ్ సందర్భంగా తలపెట్టిన ఈవెంట్ ను కూడా రద్దు చేసుకున్నారట. ఇందుకు కారణం కూడా మీడియాకు దూరంగా ఉండడమే.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ పూజా కార్యక్రమం జరిపి.. ఆ వీడియో మీడియాకు ఇవ్వాలని భావిస్తున్నారట. అలాగే కొన్ని రోజుల పాటు మీడియాకు దూరంగా ఉన్న తర్వాత.. సినిమా ప్రమోషన్స్, విడుదల సందర్భంగా ఎదురుపడ్డా.. అప్పటికే శ్రేయా భూపాల్ వ్యవహారం బాగా పాతది అయిపోతుంది. అప్పుడు ఈ టాపిక్ పై ప్రశ్నించడం కూడా అసంబద్ధం అవుతుంది. అందుకే ఇంకొన్ని నెలలపాటు మీడియాకు అఖిల్ కనిపించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
{youtube}dcMUIp5zZZk{/youtube}
Related