Tuesday, May 14, 2024
- Advertisement -

అఖిల్ కొత్త సినిమా డైరెక్టర్ ఇతనే ?

- Advertisement -

అక్కినేని వారసుడు అఖిల్ తన మొదటి సినిమా అఖిల్ తో తీవ్రంగా నిరాశ పరిచాడు. నటనలో ఓకే అనిపించుకున్నా సినిమా రిజల్ట్ విషయం లో మాత్రం మనోడు ఎక్కడా కాపాడలేకపోయాడు. సరే గతం గతః ఇప్పటికైనా ఒక మంచి స్క్రిప్ట్ తో ఏ త్రివిక్రమ్ తోనో సినిమా తీస్తాడు అఖిల్ అని ఎదురు చూస్తున్నారు అందరూ కానీ అలాంటిది ఎక్కడా జరగడం లేదు.

ఎప్పటి నుంచో ఫాన్స్ ట్విట్టర్ లో రెండో సినిమా గురించి కాస్త ఆలోచించు బాబూ బాబూ అని చెప్పి అలిసిపోయారు కూడా. తాజా వార్త ఏంటంటే హనుతో అఖిల్ రెండో సినిమా ఫిక్స్ అయ్యాడట. హను ఎన్టీఆర్ కు వినిపించిన కథ నచ్చినా కాదని చెప్పడంతో అదే కథ అఖిల్ ను వినిపించాడు. కథకు థ్రిల్ అయిన అఖిల్ నాగార్జునకు వినిపించి ఇక తన సెకండ్ సినిమాగా దాన్ని ఓకే చేస్తున్నాడట.

అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న హను అఖిల్ రెండో సినిమా తీయడం అటు అఖిల్ కు ఇటు హనుకు లక్కీ ఆఫర్ అని చెప్పాలి. చేసే సినిమా ఏదైనా సరే ఆడియెన్స్ కు కన్విన్స్ చేసే హను సినిమా అఖిల్ తో అదిరిపోయే హిట్ అందుకోవాలని ఆశిద్దాం.

Related

  1. అఖిల్ ఏం చేస్తున్నాడంటే?
  2. డిసెంబర్ లో చైతూ, అఖిల్ పెళ్లిళ్లు!
  3. ఎవరీ అఖిల్ లవర్?
  4. అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -