Friday, May 2, 2025
- Advertisement -

సినిమా బాగుంది..కానీ వసూళ్లే!

- Advertisement -

బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్‌ను బాక్సాఫీస్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. గత నాలుగేళ్లలో ఆయన 20కిపైగా సినిమాల్లో అక్షయ్ కుమార్ నటించగా ఒకటో, రెండో సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక తాజాగా అక్షయ్‌ కుమార్‌ నటించిన కేసరి 2 (Kesari 2) బాక్సాఫీస్ ముందు రాగా విమర్శకుల ప్రశంసలను పొందింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు మంచి రివ్యూలు వచ్చాక ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి. కానీ, కేసరి 2కి రివ్యూలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు రావడం లేదు.

సినిమా విడుదలైన మొదటి ఐదు రోజుల్లో ఇది కేవలం ₹39.16 కోట్లు (నెట్) మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలే అధికారికంగా వెల్లడించారు.

కోర్ట్‌రూమ్ డ్రామా కావడంతో, చాలా మంది ప్రేక్షకులు దీన్ని ఓటిటిలో చూసే ఆలోచనతో థియేటర్లకు వెళ్లడాన్ని మానేశారు. డిజిటల్ పరంగా, కేసరి 2 సినిమా రైట్స్‌ని జియో హాట్‌స్టార్ దక్కించుకోగా ఓటీటీలోనైనా సత్తాచాటుతుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -