Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కోసం రంగంలోకి బడా హీరో.. కొరటాల భారీ స్కెచ్ ?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొంత కాలంగా విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన ” ఆర్ ఆర్ ఆర్ ” తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. ఆ మూవీతో ఇండియా మొత్తం క్రేజ్ సంపాధించుకున్నాడు. దాంతో ఎన్టీఆర్ తరువాతి సినిమాపై ఇండియా మొత్తం ఆసక్తి నెలకొంది. ఇక యంగ్ టైగర్ తన తరువాతి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ” జనతా గ్యారేజ్ ” మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దాంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ మూవీ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కొరటాల గత చిత్రం ” ఆచార్య ” డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో తారక్ తో చేయబోయే సినిమాతోనైనా తిరిగి ఫామ్ లోకి రావాలని కొరటాల చూస్తున్నాడు. అంతే కాకుండా ఈ మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో కథపై మరింత కసరత్తు పెట్టడట కొరటాల శివ. ఇక కొరటాల ప్రతి సినిమాలో కూడా హీరో పాత్రకు ధీటైన పాత్రను రాసుకుంటూ ఉంటాడు.

శ్రీమంతుడు మూవీలో జగపతి బాబు, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్, ఆచార్యలో రామ్ చరణ్.. ఇలా తన ప్రతి సినిమాలో కూడా హీరోతో సమానమైన పాత్రను ఋపొందించడం కొరటాల సెంటిమెంట్.. ఇక ఎన్టీఆర్ తో చేయబోయే మూవీలో కూడా అలాంటి బలమైన పాత్ర ఉందట. అయితే ఆ పాత్ర కోసం ఈసారి ప్రముఖ బాలీవుడ్ హీరోను తీసుకునే అవకాశం ఉండని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ లిస్ట్ లో ముఖ్యంగా అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికి ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఈ వార్తా బాగా వైరల్ అవుతోంది. మరి ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఆ బాలీవుడ్ బడా హీరో ఎవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.

Also Read

పుష్ప పార్ట్ 2 లో బాలీవుడ్ స్టార్ హీరో ?

గాడ్ ఫాదర్ అంతా బాగుంది కానీ..!

వాట్సప్ లో తప్పక తెలుసుకోవాల్సిన సీక్రెట్ సెట్టింగ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -