Thursday, April 25, 2024
- Advertisement -

బోయపాటి కథకు ఫిదా ..! గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన బన్నీ..!

- Advertisement -

వరస హిట్లతో దూసుకుపోతున్నాడు ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్​ ఇండియా మూవీ పుష్ప షూటింగ్​లో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం రెండు పార్టులుగా వస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 1 షూటింగ్ ముగియగానే బన్నీ దిల్రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా ప్రారంభిస్తారు. ఆ తర్వాత మళ్లీ పుష్ప2 సెట్లోకి అడుగు పెడతారు. అలాగే అల్లు అర్జున్ లైనప్ లో మురగదాస్​ మూవీ కూడా ఉంది.

కాగా ఇటీవల మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కలిసి ఓ కథ వినిపించాడట. పక్కా మాస్​ కథ కావడం, నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో బోయపాటి -అల్లు అర్జున్ కాంబినేషన్​లో సరైనోడు వంటి బంపర్ హిట్​వచ్చింది. సరైన బ్లాక్ బాస్టర్ హిట్లు లేక సత్తా మత్త మవుతున్న అల్లు అర్జున్ కు ఊరటనిచ్చింది ఈ మూవీ.

ఇక ప్రస్తుతం బోయపాటి .. బాలయ్యతో అఖండ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు.. టీజర్​ ఆకట్టుకున్నాయి. గతంలో వీరి కాంబినేషన్​లో తెరకెక్కిన లెజెండ్​, సింహా చిత్రాలు ఘన విజయం సాధించడంతో అఖండపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బోయపాటి.. అఖండ మూవీ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ తో తీయబోయే సినిమాకు స్క్రిప్టు సిద్ధం చేస్తారని సమాచారం.

Also Read

‘అహం బ్రహ్మాస్మి’ లో బాలీవుడ్​ అగ్రనటుడు..!

రామ్​ సినిమాలో వంటలక్క..

సల్మాన్​ ప్లేస్​లో హృతిక్​ రోషన్​.. త్వరలో ఇన్షల్లా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -