Friday, April 19, 2024
- Advertisement -

సల్మాన్​ ప్లేస్​లో హృతిక్​ రోషన్​.. త్వరలో ఇన్షల్లా

- Advertisement -

సంజయ్​ లీలా భన్సాలీతో సినిమాలు చేసేందుకు ప్రముఖ బాలీవుడ్​ నటులంతా క్యూ కడతారు. చారిత్రక చిత్రాలు, విభిన్న చిత్రాలు తెరకెక్కించడలో భన్సాలీది అందవేసిన చేయి. గతంలో తెరకెక్కించిన పద్మావత్​, బాజీరావు మస్తానీ, దేవ్​దాస్​, సావారియా వంటి హిస్టారిక్​ చిత్రాలు భన్సాలీ తెరకెక్కించినవే.ఇదిలా ఉంటే భన్సాలీ.. సల్మాన్​ ఖాన్​, అలియా భట్​ హీరో హీరోయిన్లుగా ఇన్షల్లా అనే ఓ క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు.

ఈ మూవీ తన డ్రీం ప్రాజెక్ట్​ అని కూడా భన్సాలీ ప్రకటించారు. అయితే ఈ సినిమా హీరో సల్మాన్​ ఖాన్​కు నిర్మాతలకు బేదాభిప్రాయాలు రావడంతో మూవీ చర్చల దశలోనే ఆగిపోయింది. అప్పటినుంచి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు భన్సాలీ ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్టు టాక్​. సల్మాన్​ ఖాస్​ ప్లేస్​లో హృతిక్​ రోషన్​ నటించబోతున్నట్టు టాక్​ వినిపిస్తోంది.

ఇప్పటికే భన్సాలీ హృతిక్​కు స్టోరీ వినిపించాడట. ఈ కథ హృతిక్​ రోషన్​కు కూడా నచ్చేసిందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు వచ్చే చాన్స్​ ఉంది. ప్రస్తుతం భన్సాలీ “హీరా మండి” అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. “గంగూబాయి కతియావాడి” చిత్రాన్ని తెరకెక్కించాడు. వీటి తర్వాత “ఇన్షల్లా”స్టార్ట్​ చేయబోతున్నాడు. 2022 ద్వితీయార్ధంలో “ఇన్షల్లా” సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Also Read

సీఎం కుమారుడికి జోడీగా ఇస్మార్ట్​ భామ..!

రామ్ ను ఢీకొట్టే పాత్రలో తమిళ స్టార్ హీరో..!

క్లాసిక్ ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -