‘అహం బ్రహ్మాస్మి’ లో బాలీవుడ్​ అగ్రనటుడు..!

- Advertisement -

మంచు మనోజ్​ కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక దశలో ఇక నేను సినిమాలు చేయనని కూడా ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకుని సినిమాలు చేస్తానని ప్రకటించారు. మంచు మనోజ్ రీ ఎంట్రీ లో మొదలు పెట్టిన మొదటి సినిమా అహం బ్రహ్మాస్మి. మూవీ పాన్ ఇండియా కేటగిరిలో నిర్మితమవుతోంది. ఎంఎం ఆర్ట్స్​ పతాకంపై మంచు ఫ్యామిలీ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నది. శ్రీకాంత్​రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

చాలా విభిన్న కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా కొంతమేర షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్​కు చెందిన ఓ అగ్రనటుడు నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా చిత్రయూనిట్​ ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చేసింది.

- Advertisement -

బాలీవుడ్​ అగ్ర నటుడు సునీల్​ శెట్టి ఈ చిత్రం క్లైమాక్స్​లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న మనోజ్​ .. విభిన్న చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. లాక్​డౌన్​ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోగా ప్రస్తుతం నిబంధనలు సడలించడంతో త్వరలో ఈ చిత్రం షూటింగ్​ ప్రారంభమయ్యే చాన్స్​ ఉందని టాక్​.

Also Read

సల్మాన్​ ప్లేస్​లో హృతిక్​ రోషన్​.. త్వరలో ఇన్షల్లా

అమీర్​ భాయ్​ ఇదేంటి? నీతులు చెప్పడానికేనా?

సీఎం కుమారుడికి జోడీగా ఇస్మార్ట్​ భామ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -