Thursday, April 25, 2024
- Advertisement -

రామ్​ సినిమాలో వంటలక్క..

- Advertisement -

మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్​.. కార్తీకదీపం సీరియల్​తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సీరియల్​ తెలుగు నాట విపరీతమైన ఆదరణ దక్కించుకున్నది. ఇక వంటలక్క పాత్ర చేసిన ప్రేమికి ఎందరో అభిమానులయ్యారు. ఆమె నటనకు ఫిదా అయ్యారు. దీంతో కార్తీకదీపం సీరియల్​ టాప్​ రేటింగ్​తో దూసుకుపోతున్నది. వంటలక్క అంటే తెలియని తెలుగు వారుండరేమో.. అయితే బుల్లితెర ద్వారా పలువురికి సినిమాల్లో అవకాశాలు వస్తుండటం చూస్తూనే ఉంటాం.

గతంలో ప్రేమికి పలుమార్లు సినిమా చాన్స్​లు వచ్చినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. అందుకు కారణం నటనకు ప్రాధాన్యమున్న పాత్ర లేకపోవడం. అయితే తొలిసారిగా ఓ ప్రేమి ఓ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. రామ్​ పోతినేని హీరోగా.. తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ మాస్​ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్​గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు ప్రేమిని సంప్రదించిందట చిత్ర యూనిట్.పాత్ర నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉన్నది. ప్రేమికి తెలుగు నాట ఎంతో పాపులారిటీ ఉంది. ఆమె ఈ సినిమాకు ప్లస్​ అవుతుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఈ సినిమాలో ప్రేమి ఎటువంటి పాత్ర చేయబోతున్నదో వేచి చూడాలి.

Also Read

మరో స్టార్ హీరోయిన్ ని పట్టేసిన నితిన్..!

మాట తప్పిన కాజల్​.. ప్రభాస్​ కోసమేనా?

అమీర్​ భాయ్​ ఇదేంటి? నీతులు చెప్పడానికేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -