Thursday, May 16, 2024
- Advertisement -

బన్నీ బిజినెస్ మొదలు పెట్టబోతున్నాడు!

- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్. డ్యాన్స్‌లో మెచ్యూరిటీ, ఫైటింగ్ సీన్‌ల‌లో అద‌ర‌గొట్టేస్తున్నాడు. ఇటివలే రిలీజ్ అయిన స‌రైనోడు లో అల్లు అర్జున్ డిఫ‌రెంట్ లుక్‌లో కండ‌లతో ఆక‌ట్టుకున్నాడు. మెగా హీరోలలో అల్లు అర్జున్ ప్రత్యేక పేరు తెచ్చుకున్నాడు. రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి తరువాత ‘సరైనోడు’ తో ఏకంగా 2016వ సంవత్సరానికి అతిపెద్ద హిట్ కొట్టాడు అల్లు అర్జున్.

మంచి విజయలతో దూసుకుపోతున్న‌ అల్లు అర్జున్ సినిమాలేగాక మరో బిజినెస్ లో అడుగుపెడుతున్నాడు. తాజాగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడుతూ హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యాన్ని రుచి చూపేందుకు ‘ఎమ్ కిచెన్, కేదార్ శెలగం శెట్టి’ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో కలిసి నైట్ క్లబ్ లను ప్రారంభిస్తున్న‌ట్టు తెలిపాడు.

ఈ సందర్బంగా అల్లు అర్జున్ ఈనెల‌ 29న తన సన్నిహితుల కోసం భారీ ఎత్తున పార్టీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సినిమా రంగంలోనే కాకుండా కూడా స‌క్సెస్ సాధించాల‌ని ఆశిద్దాం.

Related

  1. బన్నీ మళ్లీ తండ్రి కాబోతున్నాడా?
  2. తమ్ముడు కోసం బన్నీ ఏం చేస్తున్నాడంటే?
  3. బన్నీ నిలబడాలంటే పవన్ ను తొక్కాల్సిందేనా?
  4. బన్నీకి మళ్లీ పవన్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -