Thursday, May 16, 2024
- Advertisement -

అల్లు అర్జున్ కి ఎలాంటి బిరుదు ఇచ్చారో తెలుసా?

- Advertisement -

వరస విజయలతో దూసుకెళ్తున్నాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ సాధించడంతో మనోడి రెంజ్ పెరిగిపోయింది. తెలుగులోనే కాకుండా ఇతర రాష్ట్రల్లో కూడా బన్నీకి మంచి ఇమేజ్ ఉంది. మలయాళం ఇండస్ట్రీలో బన్నీకి ఓ రెంజ్ లో ఫాలోయింగ్ ఉంది. బన్నీ మొదటి నుంచి తన సినిమాలను మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తున్నాడు.

అక్కడ కూడా బన్నీ సినిమాలు మంచి విజయం సొంతం చేసుకోవడంతో అపారమైన క్రేజ్ వచ్చింది బన్నీకి. ఒక్క మాటలో చెప్పాలంటే.. అక్కడి స్టార్ హీరోలకి సమానంగా బన్నీకి ఇమేజ్ ఉంది. ఈ కారణంగానే.. ఓ మలయాళం ఛానెల్ వారు అల్లు అర్జున్ పై తమకున్న ప్రేమను ఓ బిరుదిచ్చి చాటుకోనున్నారు. 

మిడిల్ ఈస్ట్ దేశాల్లో అవార్డుల వేడుక సందడి చేసే “ఏసియానెట్” అనే ఛానెల్ వారి “మిడిల్ ఈస్ట్ వింగ్” అల్లు అర్జున్ కి “ప్రవసి రత్న” (Migrant Diamond) అనే బిరుదును ప్రధానం చేయనున్నారు. మలయాళంలో బన్నీ కి ఉన్న క్రేజ్  అలాగే అతడి సినిమాల విజయాలు అన్ని కలిపి అవార్డు రావడానికి కారణం అయినట్లు తెలుస్తోంది. ఓ తెలుగు హీరోకి మలయాళంలో బిరుదు రావడం అది టాలీవుడ్ గర్వకారణంగా చెప్పుకోవచ్చు.

Related

  1. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  2. చరణ్ ధృవ సినిమాలో అల్లు అర్జున్!
  3. అల్లు అర్జున్ పట్టించుకోకున్నా విష్ చేసిన జక్కన్న
  4. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -