Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ సర్జరీయే అల్లు అర్జున్ కొంపముంచిందా..?

- Advertisement -
Allu Arjun Surgery Rumor

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా పై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. హరీశ్ శంకర్ మంచి కసితో సినిమా చేస్తుండటంతో పాటు అల్లు అర్జున్ తనకు బాగా అచ్చొచ్చిన సమ్మర్‌లో సినిమా విడుదల చేస్తుండటంతో అందరు ఇప్పుడు డీజే కోసం వేచి చూస్తున్నారు.

అయితే అల్లు అర్జున్ సమ్మర్ బరిలోంచి తప్పుకుంటున్నాడు అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. చిన్న పెద్ద హీరోల నుంచి స్టార్ హీరోలదాకా ఈ ఉగాదికి తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కాని డీజే టీం మాత్రం వర్కింగ్ స్టిల్స్‌తో సరిపెట్టింది. అవి కూడా ఇప్పటివి కాదట. ప్రజంట్ డీజే షూటింగ్ జరగడం లేదట. అల్లు అర్జున్‌కు సర్జరీ జరగడం వల్లే సినిమా డీలే అవుతుందట. అయితే ఈ వార్తలను కవర్ చేయడానికే ఇలా వర్కింగ్ స్టిల్స్‌ రిలీజ్ చేశారని గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిని బట్టి సమ్మర్‌ రేస్ నుంచి డీజే తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఊహగానాలన్నింటికి డీజే టీం చెక్ పెడుతుందా లేదా అన్నది వేచి చూడాలి. 

Related

  1. రష్మీతో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్
  2. పవన్ రికార్డుని పటాపంచలు చేసిన అల్లు అర్జున్
  3. రాజేంద్ర ప్రసాద్ ముసలి ఏజ్ లవ్ స్టోరీ .. అల్లూ అర్జున్ ప్రొడ్యూసర్ !
  4. బ్రేకింగ్ : అల్లు అర్జున్ సినిమాలో మెగాస్టార్ చేసే రోల్ ఇదే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -